breaking news
Allegations of illegality
-
విమర్శ హద్దు దాటితే వ్యవస్థకే ప్రమాదం
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం, దానికి గ్రేడింగ్స్ ఇవ్వడం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో, అన్ని వ్యవస్థలపై నెలకొన్న అసహనానికి ప్రతీక అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు. ‘నా తరువాత అంతా నాశనమే’ అన్న తరహాలో కొందరు మాజీ జడ్జీల తీరు ఉందన్నారు. మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ‘కోవిడ్ కాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ’ అంశంపై ఆదివారం ఆయన ఆన్లైన్ ప్రసంగం చేశారు. ‘గతంలో మన న్యాయవ్యవస్థలో భాగంగా ఉన్న కొందరిలో ఒక సమస్య ఉంది. నా తర్వాత∙అన్నీ తప్పులే జరుగుతున్నాయి అనే భావనలో వారున్నారు. ఆ భావనే ప్రమాదకరం. ఇప్పుడు మాట్లాడుతున్నవారే గతంలో చాలా తప్పులు చేశారు’ అని అన్నారు. కొంతమందికి ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఇష్టమన్నారు. హద్దులు దాటి ఆరోపణలు చేయడం ‘తప్పుడు సమాచార మహమ్మారి’ వంటిదన్నారు. విమర్శలు అవసరమే కానీ హద్దులు దాటకూడదని సూచించారు. ‘విమర్శలు హద్దులు దాటితే వ్యవస్థపై అనుమానాలు ఎక్కువవుతాయి. ఏ వ్యవస్థకయినా అది మంచిది కాదు. వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే వ్యవస్థే మనుగడలో లేకుండా పోతుంది. అప్పుడంతా అరాచకమే’ అని హెచ్చరించారు. సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్న వలస కూలీల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించడానికి ఒక రోజు ముందు సుమారు 20 మంది ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు లేఖ రాశారు. వలస శ్రామికులపై కోర్టు చూపుతున్న నిర్లిప్తత సరికాదని వారు అందులో పేర్కొన్నారు. అనంతరం ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఎప్పుడూ ప్రతికూల భావజాలాన్ని ప్రచారం చేసేవారు, ఇళ్లల్లో కూర్చుని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించే మేథావులు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. -
ఏ కోర్టూ నన్నేమీ చేయలేదు: నిత్యానంద
న్యూఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో దేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి రెచ్చి పోయారు. ఏ వెదవ కోర్టూ తనను ఏమీ చేయలేదని, తానే పరమశివుడినని వ్యాఖ్యానించారు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘నన్నెవరూ ముట్టుకోలేరు. నేను మీకు నిజం చెబుతా. నేనే పరమ శివుడిని. అర్థమైందా? ఈ నిజాన్ని ప్రకటించినందుకు ఏ వెదవ కోర్టూ నన్ను విచారిం చలేదు. నేనే పరమశివుడిని. నాదీ గ్యారెంటీ. మీకెవరికీ మరణం లేదు’అంటూ నిత్యానంద వ్యాఖ్యానించడం వీడియోలో కనిపించింది. ఇదిలా ఉండగా దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని రవీశ్‌కుమార్ మాట్లాడుతూ అన్ని దేశాల్లోని కార్యాలయాలను అప్రమత్తం చేశామని, నిత్యానంద గురించి స్థానిక ప్రభుత్వాలకు వివరించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. -
వీడని నీడలు
సాంబశివరావుపై వేటు జిల్లా వైద్యాధికారి సస్పెన్షన్ రాష్ట్రస్థాయిలో అక్రమాలే కారణం వరంగల్ : అక్రమాల ఆరోపణలపై జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి పి.సాంబశివరావుపై వేటు పడింది. సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కొత్తగా 108 వైద్య సేవల వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయిం చింది. సాంబశివరావు అప్పట్లో ప్రజారోగ్య శాఖ డెరైక్టర్‌గా ఉన్నారు. 108 వైద్య సేవల వాహనాల కొనుగోలు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ప్రాథమిక విచారణ తర్వాత సాంబశివరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వల్పకాలంలోనే ఆరోగ్య శాఖలో ఉన్నత స్థాయి పోస్టుకు చేరిన సాంబశివరావు అంతే వేగంగా కిందికి వచ్చారు. ఇప్పడు సర్వీసు నుంచి సస్పెండ్ అయ్యారు. పోస్టు కోసం పోటీ 2011 డిసెంబరులో సాంబశివరావు జిల్లా వైద్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై వరకు ఈ పోస్టులో పని చేశారు. 2014 జూన్ 2న రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా వైద్య శాఖ బాధ్యతలను చేపట్టడంతో సాంబశివరావు వేగంగా పదోన్నతులు పొందారు. శాఖ పరమైన అక్రమాలపై అప్పటికే పలు ఆరోపణలు ఉన్నా ఆయనకు జూలై 1న ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా జూలై 31న వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ పొందారు. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలోనే ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వైద్య శాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్య బర్తరఫ్కు కారణమైన ఆరోపణల విషయంలో సాంబశివరావును ప్రభుత్వం ఆ పోస్టు నుంచి తప్పించింది. జనవరిలో సాంబశివరావు ఆఖరు వారంలో మళ్లీ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో ఆరోపణలు ఆయనను వెంటాడుతూనే వచ్చాయి. రాష్ట్ర డెరైక్టరుగా సాంబశివరావు తీసుకున్న నిర్ణయాలపై విచారణలు జరుగుతున్నాయి. 108 సేవల వాహనాల కొనుగోలు అంశంలో ప్రభుత్వం తాజాగా సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. సాంబశివరావు సస్పెన్సన్ నేపథ్యంలో ఆయన పోస్టు పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా శిక్షణ ప్రాజెక్టు అధికారి(పీవోడీటీ) శ్రీరాం, జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి సాంబశివరావు పేర్లు ఈ పోస్టుకు వినిపిస్తున్నాయి. -
పరువు గాలికి
దేశానికి మేధావులు, ఇంజినీర్లు, నాయకులు, మానవ వనరులను అందించాల్సిన వర్సిటీలు పక్కదారి పడుతున్నాయి. కొందరు అధ్యాపకుల వ్యవహారంతో తెలంగాణ యూనివర్సిటీ పరువు బజారుకెక్కుతోంది. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో 2006లో తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభమైంది. అనంతరం డిచ్పల్లి శివారులో 577 ఎకరాల స్వస్థలంలోకి మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 జనవరి 31న దీనిని ప్రారంభించారు. ⇒వివాదాలకు నిలయంగా మారిన తెయూ ⇒వెల్లువెత్తిన ‘అక్రమాల’ ఆరోపణలు ⇒నిధుల వినియోగంపైనా విమర్శలు ⇒ పీహెచ్డీ ప్రవేశాలూ వివాదాస్పదం ⇒తాజాగా పరీక్షల నియంత్రణాధికారి సస్పెన్షన్ ⇒తరచూ మారుతున్న పాలనాధికారులు ⇒ఆవేదన చెందుతున్న విద్యాభిమానులు తెయూ (డిచ్పల్లి): ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తొలి వీసీ కాశీ రాం హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలు జిల్లాకు చెందిన పెద్ద నాయకుని కనుసన్నలలో జరిగినట్లు విద్యార్థి సంఘా లు ఆరోపించాయి. అనంతరం 15 జూలై 2011న తెయూ వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ ను ప్రభుత్వం నియమించింది. ఆయనపైనా పలు విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టులకు సంబంధిం చి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారి నట్లు ఆరోపణలు వచ్చాయి. అవసరానికి మించి మూడున్నర లక్షల జవాబు పత్రాల ను ముద్రింపజేసిన ఘటనలో రూ. పది లక్షలు చే తులు మారినట్లు నిందలు మోయాల్సి వచ్చింది. కేవలం ఆరు నెలల కాలంలో వీసీ తన వా హనంపై రూ.1.80 లక్షలు ఖర్చు చూపించడంపై విద్యార్థి సంఘాలు గవర్నర్‌కు ఫిర్యా దు చేయగా, ఆయన దీనిపై వివరణ కోరా రు. 12బి మంజూరు కోసం తెయూను పరి శీలించేందుకు యూజీసీ బృంద సభ్యులు సందర్శించినప్పుడు రసాయనాల పేరిట రూ.ఎనిమిది లక్షలు, ఇతర ఖర్చుల పేరిట రూ. రెండు లక్షలు ఖర్చు చూపించడం వివాదాస్పదంగా మారింది. పదవీకాలం ముగింపు దశలో యూనివర్సిటీ ఆర్చ్ (స్వాగత తోర ణం/ప్రధాన గేటు) నిర్మాణానికి రూ. 50 లక్షలు ఖర్చు చేయడం వర్సిటీ వర్గాలలో చర్చనీయాంశమైంది. బాలుర వసతి గృహంలో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నా, అదనపు గదులు నిర్మాణంపై దృష్టి సారించని వీసీ, కేవలం ఆర్చ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేయడం విమర్శలకు దారి తీసింది. వీసీ పదవి కాలంలో మారిన ఐదుగురు రిజిస్ట్రార్లు వీసీగా ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్ పని చేసిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. ఆయన భాధ్యతలు స్వీకరించిన సమయంలో రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్ శివశంకర్ సెప్టెంబర్ 2011లో పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం కొద్ది కాలం ప్రొఫెసర్ యాదగిరి ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పని చేశారు. ఆ తరువా త ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకుడు ఎన్.అశోక్‌ను రిజిస్ట్రార్‌గా 2012 మార్చ్ 12న ప్రభుత్వం నియమించింది. ఏడాది తర్వాత రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. సంవత్స రం తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. వెంటనే ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ధర్మరాజును నియమించారు. ఇలా రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు రిజిస్ట్రార్లు మారారు. తీరు మార్చుకోని అధికారులు తెలంగాణ యూనివర్సిటీలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైననాటి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతూనే ఉంది. తొలిసారి అడ్మిషన్ల సమయంలో రెండు సార్లు ఫలితాలు విడుదల చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తా యి. వర్సిటీ అధికారులు తమ తీరు మార్చుకోకుండా ఈసారి కూడా రెండు సార్లు జాబితా మార్చారు. అనర్హులకు ప్రవేశాలు కల్పిండానికే కటాప్ మార్కులు తగ్గించి అర్హులకు అన్యాయం చేశారని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందాయి. తెలుగు పీహెచ్డీ ప్రవేశాలలో అక్రమాలు జరిగినట్లు నిర్థారణ కావడంతో ఇద్దరు అధ్యాపకులకు ఇన్చార్జి వీసీ శైలజా రామయ్యర్ చార్జి మెమోలు జారీ చేశారు. నియామకాలలో అక్రమాలు అక్బర్‌అలీఖాన్ హయాంలో చేపట్టిన టీచింగ్, నాన్-టీచింగ్ నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబ్బులు తీసుకుని తమకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చారని, అర్హులకు అన్యాయం జరిగిందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరికొందరు గవర్నర్‌కు ఫిర్యా దు చేశారు. కొందరు ఉన్నత విద్యామండలికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో విచారణ కమిటీని నియమించారు. ప్రభుత్వం మాజీ రిజిస్ట్రార్లు ప్రసాద్‌రావు, భాస్కర్‌రావుతో ఒక కమిటిని నియమించగా, గవర్నర్ నరసింహన్ సూ చన మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏక సభ్య విచారణ కమిటీ ఏర్పాటైంది. ఈ రెండు కమిటీలు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికలను అందజేశాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వీసీగా అక్బర్‌అలీఖాన్ పదవి కాలం ముగిసింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు గత ఏడాది జనవరిలో 47 మంది టీచింగ్ సిబ్బంది బాధ్యతలు స్వీకరించారు. సీఓఈ సస్పెన్షన్‌తో పోయిన పరువు యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్ తర్వాత కీలకమైన పదవి పరీక్షల నియంత్రణాధికారిదే. అనుబంధ కళాశాలలు, క్యాంపస్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేది పరీక్షల విభాగమే. ఇలాంటి కీలక విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్‌ను అధికారిగా నియమించడమే విమర్శలకు తావిచ్చింది. సీఓఈగా విధులు నిర్వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ ఏక కాలంలో రెండు చోట్ల వేతనాలు పొందారనే ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడంతో వర్సిటీ పరువు మరింత దిగజారినట్లయింది. ఇప్పటికైనా వర్సిటీ ఉన్నతాధికారులు ఇలాంటివి జరగకుం డా చర్యలు తీసుకుని వర్సిటీ పరువు, ప్రతిష్టలు పెంచేలా చూడాలని పలువురు విద్యాభిమానులు కోరుకుంటున్నారు.