అహ్మదాబాద్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(84)నకు గుజరాత్ హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. 2013నాటి అత్యాచారం కేసులో జీవిత కారాగారం అనుభవిస్తున్న ఆయనకు వైద్య చికిత్స కోసం ఈ వెసులుబాటు కల్పించింది.
వారం క్రితం రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన విధంగా ఆశారాంనకు అదే కారణంతో బెయిలిస్తున్నట్లు జస్టిస్ ఐలేశ్ ఓరా, జస్టిస్ ఆర్‌టీ వచ్ఛానీ తెలిపారు. రాజస్తాన్‌లోని ఆశ్రమంలో 2013లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అక్కడి హైకోర్టు కూడా ఆశారాంనకు జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆశారాంనకు అక్టోబర్ 29న ఆరు నెలల బెయిలిచ్చింది.


