గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం | no holiday for gandhi birth anniversary, declares centre | Sakshi
Sakshi News home page

గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం

Sep 26 2014 4:31 PM | Updated on Aug 15 2018 2:20 PM

గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం - Sakshi

గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం

దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.

దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వేటికీ ఆరోజు సెలవు ఉండబోదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ రెండోతేదీన ప్రారంభిస్తారు. స్వయంగా తాను సైతం ఆరోజు చీపురు పట్టుకుని శుభ్రపరుస్తానని మోదీ ఇంతకుముందే చెప్పారు. ఆ రోజు కార్యక్రమంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలు కూడా పాల్గొంటాయి. ఇండియా గేట్ వద్ద మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితర సెలబ్రిటీలు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement