మినీ స్కర్టులు, బికినీలను నిషేధించలేం | No ban on mini-skirts, bikinis, says Goa minister | Sakshi
Sakshi News home page

మినీ స్కర్టులు, బికినీలను నిషేధించలేం

Jul 2 2014 3:08 PM | Updated on Sep 2 2017 9:42 AM

బీచ్లలో బికినీలు, నైట్ క్లబ్బులలో మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని గోవా టూరిజం మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు.

పనాజీ: బీచ్లలో బికినీలు, నైట్ క్లబ్బులలో మినీ స్కర్టులు ధరించకుండా నిషేధం విధించలేమని గోవా టూరిజం మంత్రి దిలీప్ పారులేకర్ స్పష్టం చేశారు. బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలంటూ ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సుదిన్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో పారులేకర్ పైవిధంగా స్పందించారు. ఇలా నిషేధం విధించడం సాధ్యంకాదని మంత్రి చెప్పారు.

కాగా ధావలికర్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఉచిత సలహాలు ఇచ్చే బదులు నీటి సమస్యపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రతినిధి దుర్గాదాస్ కామత్ హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement