ఆహార వ్యర్ధాల నుంచి ఇంధనం..

Nitin Gadkari Says Buses Will Soon Run On CNG - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మటన్‌,న ఫిష్‌ వ్యర్ధాలతో సీఎన్జీ తయారుచేసి బస్సులు, వాహనాలను నడిపించవచ్చని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల స్ధానంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆయన పునరుద్ఘాటించారు. పంట వ్యర్దాలను తగులబెట్టకుండా సీఎన్జీ తయారీకి ఉపయోగించే ప్రకియ లుధియానాలో ప్రారంభమైందని, ఇక మటన్‌, చేపలు, పండ్లు, కూరగాయల వ్యర్ధాలను బయో ఇంధనంగా మార్చే ప్రక్రియను మరో రెండు నెలల్లో మహారాష్ట్రలో ప్రారంభిస్తామని చెప్పారు. మెథనాల్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ను విడతీయడం ద్వారా లభ్యమయ్యే సీఎన్జీతో బస్సులు, వాహనాలను నడిపించవచ్చని తెలిపారు. పంట వ్యర్ధాలను సీఎన్జీగా మార్చే లుథియానా ప్లాంట్‌కు చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుందని చెప్పారు. వస్తువులు, ఉత్పత్తులకు ఐఎస్‌ఐ మార్క్‌ ఇచ్చే ప్రక్రియలో త్వరలో మార్పులు చేపడతామని వెల్లడించారు. నిర్ధిష్ట పరిమితికి మించి విద్యుత్‌ను వినియోగించే పరికరాలకు ఐఎస్‌ఐ మార్క్‌ కేటాయించరని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top