ప్రభావవంతమైన మహిళగా నిర్మల

Nirmala Sitharaman Got Place In UK Power List From 100 Influential Womens - Sakshi

లండన్‌ : యూకె - ఇండియా సంబంధాలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించిన 100 మంది ప్రభావంతులైన మహిళల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చోటు దక్కింది. బ్రిటన్‌కి చెందిన సీనియర్‌ కేబినెట్‌ మంత్రి పెన్నీ మోర్డాంట్ కూడా ఈ జాబితాలో నిలిచారు. సోమవారం ‘భారత దినోత్సవం’ సందర్భంగా యూకె హోంశాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ ఈ జాబితాలను పార్లమెంట్‌ హౌస్‌లో​ విడుదల చేశారు. నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో కీలకమైన పాత్ర పోషించారు. భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిర్మల గుర్తింపు పొందారు. 

నిర్మల లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎననామిక్స్‌లో తన చదువును పూర్తి చేసుకొని.. అక్కడ ఉద్యోగం కూడా చేసిన విషయం తెలిసిందే. లండన్‌ ఆమెకి ఎక్కువగా సుపరిచతమైన నగరంగా చెప్పవచ్చు. బ్రిటన్‌ - ఇండియా దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాల్లో నిర్మల ఎంతో ప్రతిభ కనబరిచనారు. మహిళా శక్తికి నిదర్శనంగా ఈ జాబితాలో ఆమెకు స్థానం దక్కిందని యూకెలోని భారత హైకమిషనర్ రుచి ఘనశ్యాం పేర్కొన్నారు. ఈ జాబితాలోని మహిళలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే కాదు.. ఇరు దేశాలను శక్తిమంతంగా మలచడంలో కృషి చేశారని అన్నారు. వాణిజ్యం, కళలు, అక్షరాస్యత తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top