నైజీరియన్‌ అరెస్ట్‌.. డ్రగ్స్‌ స్వాధీనం | Nigerian arrested in drugs selling case | Sakshi
Sakshi News home page

నైజీరియన్‌ అరెస్ట్‌.. డ్రగ్స్‌ స్వాధీనం

May 31 2017 7:55 PM | Updated on Oct 17 2018 5:27 PM

బెంగళూరులోని బిళిశివాలే వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియా దేశస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బనశంకరి: బెంగళూరులోని బిళిశివాలే వద్ద మాదకద‍్రవ్యాలు విక్రయిస్తున్న ఓ నైజీరియా దేశస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైకేల్‌ ఇయామ్ అనే యువకుడు స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా ఉంటున్నాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ యువతతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.

ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.6 లక్షల విలువైన కొకైన్, 14 సెల్‌ఫోన్లు, రెండు పాస్‌పోర్టులు, ఒక కారు, 3 హార్డ్‌డిస్క్ లు, ఒక ఐ ప్యాడ్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కారులో సంచరిస్తూ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, ఇతనిపై కొత్తనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement