passports recovered
-
నైజీరియన్ అరెస్ట్.. డ్రగ్స్ స్వాధీనం
బనశంకరి: బెంగళూరులోని బిళిశివాలే వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ నైజీరియా దేశస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైకేల్ ఇయామ్ అనే యువకుడు స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొంతకాలంగా ఉంటున్నాడు. ఖరీదైన కార్లలో తిరుగుతూ యువతతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.6 లక్షల విలువైన కొకైన్, 14 సెల్ఫోన్లు, రెండు పాస్‌పోర్టులు, ఒక కారు, 3 హార్డ్‌డిస్క్ లు, ఒక ఐ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కారులో సంచరిస్తూ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని, ఇతనిపై కొత్తనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
గల్ఫ్ నకిలీ ఏజెంట్ల అరెస్టు
మెట్పల్లి(కరీంనగర్): ముగ్గురు గల్ఫ్ నకిలీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలో పలువురి నుంచి వేల రూపాయలు వసూలు చేసిన వీరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వీరిని ఈ రోజు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 266 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్‌లో హుజీ తీవ్రవాదులు!
-
హైదరాబాద్‌లో హుజీ తీవ్రవాదులు!
హైదరాబాద్ : హుజీ తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో నలుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్ పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురికి హుజీ తీవ్రవాద సంస్థతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారితో పాటు మరికొంతమంది సానుభూతిపరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిలో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ నజీర్ రెండు నెలలుగా హైదరాబాద్‌లో మకాం వేసినట్లు సమాచారం. పోలీసుల అదుపులో మొత్తం 15మంది సానుభూతిపరులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పాతబస్తీ చాంద్రాయణగుట్ట బాబానగర్‌లో రెండు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న ఈ నలుగురిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరుపుతున్నారు. కాగా వీరి అరెస్ట్‌ను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రదాడుల దాడి జరగవచ్చని, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హుజీ ఉగ్రవాదులు హైదరాబాద్‌లో అరెస్ట్ కావటం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.