జకీర్కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ | NIA File Case Against Zakir Naik, Raid 10 Centres Of His NGO | Sakshi
Sakshi News home page

జకీర్కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ

Nov 19 2016 9:16 AM | Updated on Oct 5 2018 9:09 PM

జకీర్కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ - Sakshi

జకీర్కు గట్టి ఝలక్.. కేసు.. వేట షురూ

వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్పై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మతాల మధ్య ఆయన విద్వేషాలు ప్రోత్సహిస్తున్నాడంటూ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్పై జాతీయ దర్యాప్తు సంస్థ వేట మొదలుపెట్టింది. మతాల మధ్య ఆయన విద్వేషాలు ప్రోత్సహిస్తున్నాడంటూ ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్రలోని ఆయన నిషేధిత సంస్థతో సంబంధం కలిగి ఉన్న పది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇందులో ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు, ఆ సంస్థలకు జకీర్ కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంపైనా ఆరా తీస్తుంది.

పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత జకీర్ ను ఎన్ఐఏ భారత్ రప్పించే అవకాశం ఉంది. ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) వ్యవస్ధాపకుడైన జకీర్ నాయక్ కు కేంద్ర ప్రభుత్వం మంగళవారం గట్టి ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది.

 ఐఆర్ఎఫ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర కేబినేట్ నిర్ధారించింది. కాగా, జకీర్ నాయక్ స్పీచ్ లపై ప్రభుత్వం గతంలో వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పీస్ టీవీతో జకీర్ ఉన్న సంబంధాలు, ముంబైలో ఉన్న ఐఆర్ఎఫ్ లో పనిచేసే వ్యక్తులపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకే కేబినేట్ ఐఆర్ఎఫ్ పై నిషేధం విధించిందని సమాచారం. గతంలో ఒసామా బిన్ లాడన్ ను పొగుడుతూ జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐబీ ఆయనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో జోడించినట్లు తెలిసింది. నాయక్ పై టెర్రరిజానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేసే అవకాశాలపై ఎన్ఐఏ పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement