ఆ పాఠ్య పుస్తకాల్లో 'టీ‌' కు చోటు! | NCERT to Consider a Chapter on Tea for Class 6 to 8 | Sakshi
Sakshi News home page

ఆ పాఠ్య పుస్తకాల్లో 'టీ‌' కు చోటు!

May 22 2016 9:08 PM | Updated on Sep 4 2017 12:41 AM

ఆ పాఠ్య పుస్తకాల్లో 'టీ‌' కు చోటు!

ఆ పాఠ్య పుస్తకాల్లో 'టీ‌' కు చోటు!

దేశంలో దాదాపు 90 శాతం సేవించే పానీయాన్ని ఎన్ సీఈఆర్ టీ పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించాలని నార్త్ ఈస్ట్ టీ అసోసియేషన్ (నేటా) టెక్ట్స్ బుక్ డెవలప్ మెంట్ కమిటీని కోరింది.

గుహవతి: దేశంలో గరీబు నుంచి నవాబు వరకు పరిచయం అక్కరలేని పానీయం.. 'టీ'. దేశంలో దాదాపు 90 శాతం సేవించే ఈ పానీయానికి ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో చోటు కల్పించాలని నార్త్ ఈస్ట్ టీ అసోసియేషన్ (నేటా)   టెక్ట్స్ బుక్ డెవలప్ మెంట్ కమిటీని కోరింది. నెటా   కేంద్ర  మానవ వనరులశాఖా మంత్రి స్మృతి ఇరానీకి కూడా విజ్ఞప్తి చేసినట్టు ఎన్ సీటీఆర్ టీ అడ్వైజర్ విద్యానంద బర్కకోటే తెలిపారు.  
 
దీనిపై స్పదించిన ఎన్సీఈఆర్టీ బోర్డు  మారిన సెలబస్ లో ఆరు, ఎనిమిది తరగతుల జాగ్రఫీ పాఠ్యాంశాల్లో  'టీ' గురించిన సమాచారాన్ని చేర్చినట్టు వెల్లడించింది. ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో మన వాటా 25 శాతంగా ఉంది. తేయాకు పరిశ్రమకి ఇండియాలో 109 ఏళ్ల చరిత్ర  ఉంది. తేయాకు పరిశ్రమలో 50 శాతం మంది మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. మహిళలు అత్యధికంగా ఉపాధిని ఈ రంగంలో పొందుతున్నారు. 83 శాతం కుటుంబాలు టీ ని సేవిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement