హైవేపై అత్యవసర ల్యాండింగ్‌

NCC training aircraft makes emergency landing on highway - Sakshi

ఘజియాబాద్‌: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో పైలెట్‌ జాతీయరహదారిపై సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్‌సీసీకి చెందిన రెండు సీట్ల శిక్షణ విమానం ఒకటి గురువారం మధ్యాహ్నం బరేలీ నుంచి హిండన్‌ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అరగంట తర్వాత ఇంజిన్‌లో లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్‌ అప్రమత్తమయ్యాడు. అధికారుల సూచనల మేరకు ఘజియాబాద్‌ జిల్లాలో రెండో నంబర్‌ జాతీయ రహదారిపై విమానాన్ని అత్యవసరంగా దింపాడు. అందులోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం రెక్క ఒకటి స్వల్పంగా దెబ్బతింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top