తూర్పు నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక సామర్థ్యంపై వస్తున్న కథనాలను నేవీ చీఫ్ ఆర్కే ధవన్ ఖండించారు.
విశాఖపట్నం: తూర్పు నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక సామర్థ్యంపై వస్తున్న కథనాలను నేవీ చీఫ్ ఆర్కే ధవన్ ఖండించారు. ఆ కథనాలు అవాస్తవం అన్నారు. నౌక పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తరువాతే సముద్రంలోకి పంపినట్లు తెలిపారు. గురువారం రాత్రి నౌక నీట మునిగిన ఘటనలో మృతి చెందిన జాకబ్ కుటుంబాన్ని ధవన్ పరామర్శించారు. నౌక కోసం, గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు నేవీ పూర్తిగా సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.
టార్పెడో రికవరీ వెసల్ ట్రావ్-72 అనే నౌక ప్రమాదవ శాత్తు గురువారం రాత్రి నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. 23 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. జాకబ్ మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారి కోసం వెతుకుతూనే ఉన్నారు.
**