వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్ | national investigation agency arrested 6 people in vadodara | Sakshi
Sakshi News home page

వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్

Jan 24 2016 4:30 PM | Updated on Nov 6 2018 4:55 PM

వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్ - Sakshi

వడోదరలో ఆరుగురు అనుమానితుల అరెస్ట్

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పలు మెట్రో నగరాల్లో దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు.

న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో పలు మెట్రో నగరాల్లో దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా దాడులు జరుపుతున్నారు. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో దాడులు జరిపి 14 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా గుజరాత్లోని వడోదరలో ఐదుగురు ఐఎస్ ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేశారనే సమాచారం అందిన నేపథ్యంలో దేశ రాజధానిలో తనిఖీలు ముమ్మరం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement