అనీల్ అంబానీపై మోడీ ప్రశంసల జల్లు! | Narendra Modi praises Anil Ambani for 'Swachh Bharat' drive | Sakshi
Sakshi News home page

అనీల్ అంబానీపై మోడీ ప్రశంసల జల్లు!

Oct 8 2014 12:45 PM | Updated on Aug 15 2018 2:20 PM

అనీల్ అంబానీపై మోడీ ప్రశంసల జల్లు! - Sakshi

అనీల్ అంబానీపై మోడీ ప్రశంసల జల్లు!

'స్వేచ్చ భారత్' ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు.

న్యూఢిల్లీ: 'స్వేచ్చ భారత్' ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ముంబైలోని చర్చ్ గేట్ స్టేషన్ ప్రాంతాన్ని తన స్నేహితులతో కలిసి శుభ్ర చేసిన అనిల్ అంబానీ కృషి అభినందించదగినది అని ట్విటర్ లో మోడీ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ముంబై డౌన్ టౌన్ ప్రాంతంలోని రన్సర్స్ క్లబ్ ను తన సహచరులతో కలిసి అనిల్ అంబానీ శుభ్రం చేశారు. 
 
దేశవ్యాప్తంగా పరిశుభ్రత పాటించే విధంగా మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 'స్వేచ్చ భారత్' పేరుతో ప్రధాని మంత్రి మోడీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ భారత్ మిషన్ ను ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనిల్ అంబానీతోపాటు సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హసన్, యోగా గురువు రాందేవ్ బాబా, కాంగ్రెస్ నేత శశి థరూర్ లను మోడీ ఎంపిక చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement