ప్రధాని మోదీ విదేశీయానం ఖర్చు 2 వేల కోట్లు  | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 29 2018 2:35 AM

Narendra Modi Foreign Trips Cost Over Rs 2000 Crore Since 2014 - Sakshi

న్యూఢిల్లీ: 2014 జూన్‌ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయా నానికి రూ.2,021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. ప్రధాని పర్యటనల కారణంగా భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014–18 సంవత్సరాల మధ్య ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో ఎఫ్‌డీఐలు అత్యధికంగా వచ్చే మొదటి పది దేశాలు కూడా ఉన్నాయన్నారు. 2014లో 30,930.5 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు పర్యటనల ఫలితంగా 2017 నాటికి 43,478.27 మిలియన్‌ డాలర్లకు చేరాయని తెలిపారు. యూపీఏ–2 హయాంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనల ఖర్చు 2009–14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని వీకే సింగ్‌ పేర్కొన్నారు.   

Advertisement
Advertisement