ఢిల్లీ తిరిగొచ్చిన ప్రధాని మోదీ | narendra modi arrives delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ తిరిగొచ్చిన ప్రధాని మోదీ

Dec 25 2015 8:35 PM | Updated on Aug 21 2018 9:39 PM

ఢిల్లీ తిరిగొచ్చిన ప్రధాని మోదీ - Sakshi

ఢిల్లీ తిరిగొచ్చిన ప్రధాని మోదీ

రష్యా, అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల పర్యటన ముగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశం తిరిగొచ్చారు.

న్యూఢిల్లీ: రష్యా, అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ దేశాల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశం తిరిగొచ్చారు. శుక్రవారం రాత్రి లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోదీ ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడ మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మోదీ అక్కడి నుంచి నేరుగా మాజీ ప్రధాని వాజ్పేయి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపనున్నారు.

ఈ నెల 23న మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో ప్రధాని సమావేశమై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అక్కడి నుంచి అఫ్ఘానిస్తాన్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఈ రోజు సాయంత్రం కాబూల్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లారు. లాహోర్లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరూ ప్రత్యేక విమానంలో షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపిన మోదీ.. ఆయన మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. అనంతరం లాహోర్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. షెడ్యూల్ లో పాక్ టూర్ లేకపోయినా షరీఫ్ ఆహ్వానం మేరకు ఈ రోజు మోదీ ఆకస్మికంగా ఆ దేశంలో పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement