
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి సమర్థించుకున్నారు. ప్రధాని మోదీ నాకంటే పెద్ద నటుడు.. అందులో సందేహం లేదని ఆయన మరోసారి చెప్పారు. ప్రధాని మోదీ గురించే కాకుండా కమల్ హాసన్, రజనీకాంత్‌లపైనా ఆయన స్పందించారు. కమల్, రజనీకాంత్‌లకు సినిమాలు, నటన పరంగా పెద్ద అభిమానిని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అయితే వారు పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి దిగితే మాత్రం వారికి ఓటు వేయనని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. అయితే వర్తమాన రాజకీయాలు, ఇతర అంశాలపై నా భావాలను ప్రకటిస్తూనే ఉంటానని తెలిపారు. మెర్శిల్ వివాదాల నేపథ్యంలో.. విశాల్ ఇంటిపై జరిగిన ఐటీ దాడికి బీజేపీ సంబంధలేదని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం విశేషం.