కేరళ: అరుదైన ఉదంతం

Muslim Couple Conducts Wedding of Adopted Hindu Girl in Hindu Temple - Sakshi

తిరువనంతపురం: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన ఉదంతానికి కేరళ వేదికగా నిలిచింది. ఓ ముస్లిం జంట హిందూ యువతికి వివాహం జరిపించి మతం కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పారు. కాసరగడ్‌లోని భగవతి ఆలయంలో ఆదివారం ఈ వివాహం జరిగింది. (చదవండి: ఇన్ని లక్షణాలున్న వధువు దొరికేనా..!)

తల్లిదండ్రులు మరణించడంతో రాజేశ్వరి అనే బాలికను అబ్దుల్లా, ఖదీజా దంపతులు పెంచుకున్నారు. రాజేశ్వరి తండ్రి వీరివద్ద పనిచేసేవాడు. రాజేశ్వరి చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో ఆమెను అబ్దుల్లా, ఖదీజా దంపతులు చేరదీశారు. తమ ముగ్గురు కుమారులు షమీమ్‌, నజీబ్‌, షరీఫ్‌లతో పాటు రాజేశ్వరిని పెంచి పెద్ద చేశారు. విష్ణుప్రసాద్‌ అనే యువకుడితో ఆదివారం వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు హిందూ, ముస్లిం మతాలకు చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరుకావడం విశేషం.

కాగా, మత సామరస్యానికి అద్దం పట్టే మరో ఘటన గత నెలలోనూ చోటుచేసుకుంది. మతపరమైన అడ్డంకులను అధిగమించి కాయంకుళంలోని మసీదు.. హిందూ వివాహ వేడుకకు వేదికగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: కాశీ మహాల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆశ్చర్యకర ఘటన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top