వర్ధమాన మోడల్ ఆత్మహత్య | Mumbai: 25-year-old struggling model commits suicide | Sakshi
Sakshi News home page

వర్ధమాన మోడల్ ఆత్మహత్య

Jul 14 2016 12:57 PM | Updated on Nov 6 2018 7:56 PM

వర్ధమాన మోడల్ ఆత్మహత్య - Sakshi

వర్ధమాన మోడల్ ఆత్మహత్య

గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవాలని ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన వర్ధమాన మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది.

ముంబై: గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోవాలని ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన వర్ధమాన మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల కరమ్ జీత్ కౌర్ ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. రంజాన్ పండుగ ముందురోజే ముంబై వచ్చిన ఆమె తన స్నేహితుడితో కలిసి ఆంధేరీ ప్రాంతంలో ఒక ఫ్లాట్లో ఉంటోంది.

బుధవారం రాత్రి స్నేహితుడు ఇంటికి తిరిగొచ్చేసరికి లోపలి నుంచి తలుపు తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటి లోపలికి వెళ్లేసరికి ఆమె నిర్జీవంగా తాడుకు వేలాడుతోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఆమె స్నేహితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరమ్ జీత్ కౌర్ బలవన్మరణానికి కారణాలు వెల్లడి కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement