సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డి ఎన్నిక | MP Vijayasaray Reddy Elected Parliamentary Committee | Sakshi
Sakshi News home page

సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డి ఎన్నిక

Aug 9 2019 9:44 AM | Updated on Aug 9 2019 11:42 AM

MP Vijayasaray Reddy Elected Parliamentary Committee - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాభదాయక పదవులఅంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, బీజేపీ ఎంపీ మహేష్‌ పోద్దార్, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డోలా సేన్, బీజేడీ ఎంపీ సస్మిత్‌ పాత్ర ఎన్నికైన వారిలో ఉన్నారు. కాగా, ఈ కమిటీకి ఇప్పటికే లోక్‌సభ నుంచి 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement