కశ్మీర్‌పై ఆ పనికి దిగితే..!?

more military force in Kashmir? Most Indians support it - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌పై అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ ప్యూ.. సంచలన విషయాన్ని బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ యాక్ట్‌ (ఏపీఎస్‌పీఏ)ను ఉపసంహరించాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే జమ్మూ కశ్మీర్‌లో మరింతగా సైనికులను రంగంలోకి దించాలని 60 శాతం మంది కోరుకుంటున్నట్లు ప్యూ సర్వే సంస్థ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు సమస్య, ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో మెజారిటీ భారతీయులు సైనిక చర్య చేపట్టాలని కోరుకుంటున్నట్లు సర్వే ప్రకటించింది. ఇప్పడున్న సైన్యం కన్నా మరింత అధికంగా సైన్యాన్ని లోయలోకి దించాలని 63 శాతం మంది ప్రజలు అభిప్రాయపడినట్లు సర్వే పేర్కొంది.

పాక్‌పై ఆగ్రహం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పాకిస్తాన్‌పై దేశ ప్రజల్లో తీవ్రవ్యతిరేక భావనలు మరింతగా పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఆరుమంది పాకిస్తాన్‌పై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని సర్వే పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే పాకిస్తాన్‌ను ద్వేషించేవారు 55 శాతం మేర పెరిగారు. కశ్మీర్‌ విషయంలో పార్టీలకతీతంగా మెజారిటీ ప్రజలు పాకిస్తాన్‌ను ద్వేషిస్తున్నట్లు సర్వే తెలిపింది. అమెరికాకు చెందిన ప్యూ సర్వే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్యలో దేశంలోని పలు ప్రాంతాల్లో 2,464 మందిని సర్వే చేసింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top