‘మోడీ కార్యక్రమాలకు వెళ్లొద్దు’ | Modi programs don't came says congress | Sakshi
Sakshi News home page

‘మోడీ కార్యక్రమాలకు వెళ్లొద్దు’

Aug 21 2014 2:17 AM | Updated on Mar 29 2019 9:24 PM

హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాకు మంగళవారం ఎదురైన అనుభవంపై కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది.

న్యూఢిల్లీ: హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడాకు మంగళవారం ఎదురైన అనుభవంపై కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. బీజేపీయేతర(విపక్ష) సీఎంలు ఇక నుంచి ప్రధాని మోడీ సభల్లో పాల్గొనరాదంటూ హితబోధ చేసింది. ఆత్మాభిమానం లేని విపక్ష సీఎంలే ప్రధాని రాజకీయ సభల్లో పాల్గొంటారంటూ చురకలు సైతం అంటించింది.

ప్రోటోకాల్ మేరకు ఆయా రాష్ట్రాల్లో మోడీ పాల్గొనే సభలకు హాజరై ‘మమ’ అనిపిస్తే సరిపోతుందని పేర్కొంది.  త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్న ప్రధాని కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరం గా ఉండాలని బీజేపీయేతర సీఎంలకు కాంగ్రెస్ సూచించింది. ఈ కారణంగా నేడు నాగ్‌పూర్‌లో ప్రధాని మోడీ రానున్న కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ హాజరుకావడం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement