ఆ పెళ్లిని మోదీ చెడగొట్టారు! | Modi defaced the marriage! | Sakshi
Sakshi News home page

ఆ పెళ్లిని మోదీ చెడగొట్టారు!

Jul 8 2016 3:58 AM | Updated on Aug 21 2018 9:33 PM

ఆ పెళ్లిని మోదీ చెడగొట్టారు! - Sakshi

ఆ పెళ్లిని మోదీ చెడగొట్టారు!

అతనో వ్యాపారవేత్త, ఆమె ప్రభుత్వోద్యోగి. ఇద్దరూ కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవటమే....

కాన్పూర్: అతనో వ్యాపారవేత్త, ఆమె ప్రభుత్వోద్యోగి. ఇద్దరూ కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమయ్యారు. పెళ్లికి ముహూర్తం పెట్టుకోవటమే ఆలస్యం. వివాహం ఏర్పాట్లపై మాట్లాడుకునేందుకు ఓ గుడిలో వీరిద్దరూ కలిశారు. పెళ్లిపనులపై మాట్లాడుకుంటున్నారు. మాటల మధ్యలో దేశంలో ఆర్థిక మందగమనంపైకి వీరి చర్చ వెళ్లింది. ఈ పరిస్థితికి మోదీయే కారకుడని యువతి తన అభిప్రాయాన్ని చెప్పింది. మోదీ అభిమానైన పెళ్లి కొడుకు.. దీన్ని ఖండించాడు. ఇదే విషయంపై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో భిన్నాభిప్రాయాలతో కలిసి ఉండటం కష్టమని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పేశారు.

Advertisement
 
Advertisement
Advertisement