మోదీ రాక్ స్టారే.. కానీ | 'Modi a rockstar, but must remember he is PM of India, not BJP' | Sakshi
Sakshi News home page

మోదీ రాక్ స్టారే.. కానీ

May 23 2015 7:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

మోదీ రాక్ స్టారే.. కానీ - Sakshi

మోదీ రాక్ స్టారే.. కానీ

ఇంటా-బయటా తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీని రాక్ స్టార్ గా ఒప్పుకుంటూనే కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది.

పనాజీ: ఇంటా-బయటా తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీని రాక్ స్టార్ గా ఒప్పుకుంటూనే కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది.  విదేశీ టూర్లతో బిజీగా ఉన్న మోదీ..  దేశ ప్రధాని అనే సంగతిని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని గోవా కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వాడాక్కాన్ ఎద్దేవా చేశారు.  శనివారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..   విదేశాల్లో మోదీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన మోదీ..  విదేశీ పర్యటలనపై అమితాసక్తి కనబరుస్తున్నారని మండిపడ్డారు.

 

'మోదీ ఒక రాక్ స్టారే.  నేను ఒప్పుకుంటాను. దేశానికి మాత్రమే ఆయన ప్రధాని. బీజేపీకి ప్రధాని కాదు అనే విషయం గుర్తించుకోవాలి' వాడాక్కాన్  అన్నారు. ఈ దేశానికి ప్రధాని అనే కనీస బాధ్యతను మరిచిపోతున్న నరేంద్ర మోదీ.. కేవలం విదేశీ మట్టి గురించే మాత్రమే మాట్లాడుతుండటం ఎంతవరకూ సబబు అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement