టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య | minor girl gang raped, asked to go home naked, commits suicide | Sakshi
Sakshi News home page

టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య

Jan 6 2016 12:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య - Sakshi

టీనేజర్ల వికృతం.. బాలిక ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఇంటికి వెళ్లమంటూ వికృతంగా ప్రవర్తించడంతో.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

రాయ్పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఇంటికి వెళ్లమంటూ వికృతంగా  ప్రవర్తించడంతో.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
పోలీసులు అందించిన సమచారం ప్రకారం డిసెంబర్ 29న తెండా నబాపరా గ్రామానికి చెందిన బాలిక (15) స్నేహితులతో కలిసి సమీప గ్రామంలోని సంతకు వెళ్లింది. తిరిగి వస్తుండగా వారిని ఐదుగురు వ్యక్తులు వెంబడించారు. ఆమె స్నేహితులను కొట్టి, అమ్మాయిని అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడితో వారి ఆగడాలు ఆగలేదు. నగ్నంగానే ఇంటికి వెళ్లాలని అనాగరికంగా ప్రవర్తించారు. ఆమె దుస్తులు, ఇతర వస్తువులను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో  అవమానాన్ని తట్టుకోలేని బాలిక  సంఘటనా స్థలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు టీనేజర్లు, ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకున్నామని  పోలీసులు తెలిపారు.  కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement