
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు అయింది. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కాగా లాక్‌డౌన్ సమయంలో ఢిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.