రామ్‌పుకార్‌ కథ సుఖాంతం | Migrant Worker Ram Pukar Pandit Reached His Home In Begusarai | Sakshi
Sakshi News home page

రామ్‌పుకార్‌ కథ సుఖాంతం

Published Tue, May 19 2020 7:25 AM | Last Updated on Tue, May 19 2020 8:26 AM

Migrant Worker Ram Pukar Pandit Reached His Home In Begusarai - Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన వలసజీవి రామ్‌పుకార్‌ పండిట్‌(38) కథ సుఖాంతమైంది. ఢిల్లీలో నిర్మాణ రంగ కార్మికుడిగా పొట్టపోసుకుంటున్న ఇతడు.. కొడుకు మృత్యు ఒడిలో ఉన్నాడని తెలిసి ఢిల్లీ నుంచి 1,200 కి.మీ.ల దూరంలోని సొంతూరుకు కాలినడకన బయల్దేరడం, లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు అడ్డుకోవడం తెల్సిందే. తన వేదనను బంధువుకు ఫోన్‌లో మొరపెట్టుకుంటూ రోదిస్తున్న ఫొటో సమాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దాతలు స్పందించి సాయం చేశారు. దీంతో శ్రామిక్‌ రైలులో సొంతూరు బిహార్‌లోని బెగూసరాయ్‌కు చేరుకున్నాడు. బలహీనంగా ఉన్న రామ్‌ను అధికారులు ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెల్సి భార్య, కూతురు(9) ఎట్టకేలకు ఆదివారం ఆయను ఆస్పత్రిలో కలుసుకున్నారు.
చదవండి: ప్రతీ లక్షకు 7.1 కరోనా కేసులు
చదవండి: కర్ణాటకలో వారికి నో ఎంట్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement