ఇది ‘మీ టూ’ కాదు.. ‘మెన్‌ టూ’ ఉద్యమం

metoo is not Men Too movement - Sakshi

బెంగళూరు: పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నవారి అసలు రంగులు బయటపెడుతున్న మహిళలపై లైంగిక వేధింపుల నిరసన ఉద్యమం ‘మీ టూ’ తరహాలో మరో ఉద్యమం ప్రారంభమైంది. దీని పేరు ‘మెన్‌ టూ (పురుషులు కూడా)’. మహిళల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల గొంతుకగా ఇది నిలవనుందని ఈ ఉద్యమాన్ని ప్రారంభించినవారు చెబుతున్నారు. 2017లో ఒక లైంగిక వేధింపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన మాజీ ఫ్రెంచ్‌ రాయబారి పాస్కల్‌మాజురి సహా ఓ 15 మంది కలిసి ఈ ‘మెన్‌ టూ’ని ప్రారంభించారు.

స్త్రీలపైనే కాదు.. పురుషులపైనా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఇక పురుషులు కూడా నోరు విప్పి తమపై స్త్రీలు చేసే వేధింపులను చెప్పాలని ఈ కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. అంతేకాదు, పురుషులపై పెట్టే తప్పుడు వేధింపుల కేసులకు వ్యతిరేకంగా కూడా పోరాడుతామన్నారు. లైంగిక సమానత్వ చట్టాలు రావాలని వారు కోరుతున్నారు. మీ టూ ఉద్యమాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే, ఆ పేరుతో వ్యక్తిగత కక్షలతో తప్పుడు అభియోగాలు మోపి, మర్యాదస్తుల పరువు తీయొద్దని కోరుకుంటున్నామని వివరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top