'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు' | Mehr Tarar denied any 'proximity' 'relationship' with Shashi Tharoor: Delhi Police Sources | Sakshi
Sakshi News home page

'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు'

Jul 18 2016 11:25 AM | Updated on Sep 18 2019 3:04 PM

'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు' - Sakshi

'ఆయనతో ఎటువంటి సంబంధం లేదు'

శశి థరూర్తో తనకు సాన్నిహిత్యం లేదని పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ వెల్లడించినట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సునందా పుష్కర్ మృతి కేసులో పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ ను ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఆమెను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు ప్రశ్నించినట్టు తెలిపాయి.

సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై మెహర్ ను అధికారులు అడిగినట్టు సమాచారం. శశి థరూర్తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్టు తెలిసింది. ఆయనతో తనకు సంబంధం ఉందన్న ఆరోణలను ఆమె తోసిపుచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద్ స్నేహితురాలు నళిని సింగ్  చేసిన ఆరోపణలను కూడా మెహర్ కొట్టిపారేశారు.

ఫిబ్రవరిలోనే శశిథరూర్ ను ఐదుగంటల పాటు పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2014 జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ తానున్న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement