సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి | Sakshi
Sakshi News home page

దాడిపై న్యాయ విచారణ జరిపించాలి: మాయావతి

Published Mon, Jan 6 2020 9:27 AM

Mayawati Says Violence at JNU Condemnable And Shameful - Sakshi

లక్నో : జేఎన్‌యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని ఖండించిన మాయావతి సోమవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జేఎన్‌యూలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి సిగ్గుచేటు. తీవ్రంగా ఖండించదగినది. ఈ పాశవిక చర్యకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి.. దాడిపై న్యాయ విచారణ జరిపితే మంచిది’ అని ట్వీట్‌ చేశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.(జేఎన్‌యూలో దాడిని ఖండించిన బాలీవుడ్‌ తారలు)

జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోకి ఆదివారం రాత్రి చొరబడిన దుండగులు విద్యార్థులపై కర్రలతో, రాడ్లతో దాడిగి తెగబడిన విషయం తెలిసిందే. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. ముసుగు దాడిలో గాయపడ్డ విద్యార్థులు, జేఎన్‌యూఎస్‌ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనను ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరవింద్‌ కేజ్రీవాల్‌ తక్షణమే యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. కాగా ఏబీవీపీకి సంబంధించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
చదవండి. ‘తలపై పదే పదే కాలితో తన్నాడు’

Advertisement
Advertisement