మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు | Massive search with pilotless planes to find 19 missing students | Sakshi
Sakshi News home page

మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు

Jun 11 2014 6:26 PM | Updated on Sep 2 2017 8:38 AM

మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు

మృతదేహాలను వెతికేందుకు మానవ రహిత విమానాలు

హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 19 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది.

మండి( హిమాచల్ ప్రదేశ్): హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనలో మృతి చెందిన 18 మంది విద్యార్థులను వెతికేందుకు మానవ రహిత విమానాన్ని వినియోగించుకోనున్నట్టు జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. నదిలో మునిగిపోయిన విద్యార్ధుల ఆచూకీని తెలుసుకునేందుకు ఉపరితలం నుంచి మానవ రహిత విమానం ద్వారా ఫోటోలు తీయడానికి వినియోగించనున్నారు. 
 
విద్యార్ధుల మృతదేహాలను గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ ద్వారా విమానం ఫోటోలు తీయడానికి, నీటి అడుగు భాగంలో పనిచేసే కెమెరాల వినియోగం, ప్రమాద ఘటనా స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు జాతీయ విపత్తు సంస్థ నిర్ణయం తీసుకుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement