డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం  | Marshall's Dress Code Changes Upsets Army Officers | Sakshi
Sakshi News home page

డ్రెస్‌కోడ్‌ని పునఃసమీక్షిస్తాం 

Nov 20 2019 3:58 AM | Updated on Nov 20 2019 3:58 AM

Marshall's Dress Code Changes Upsets Army Officers - Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభలో మార్షల్స్‌ ధరించే యూనిఫాం తీరును తాజాగా మార్చిన విషయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆదేశించారు. నూతన డ్రెస్‌కోడ్‌పై సైనికాధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెంకయ్య పై విధంగా ఆదేశించారు. ఇప్పటివరకు మార్షల్స్‌ ధరిస్తోన్న భారత సాంప్రదాయ సఫారీ డ్రెస్, తలపాగా స్థానంలో సైనికాధికారులు ధరించే ముదురు నీలం రంగు, ముదురు ఆకుపచ్చరంగు యూనిఫాంలను రాజ్యసభ మార్షల్స్‌కి కేటాయించారు. అయితే ఇది సైనికాధికారులు ధరించే యూనిఫాంలను పోలి ఉందని అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖుల నుంచి అభ్యంతరాలు రావడంతో డ్రెస్‌కోడ్‌లో మార్పులను పునఃసమీక్షించాలని సచివాలయ సిబ్బందిని వెంకయ్య ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement