బంధువులు కాబోతున్న లాలూ, ములాయం | Marriage may forge new Mulayam Singh Yadav- Lalu Prasad's alliance | Sakshi
Sakshi News home page

బంధువులు కాబోతున్న లాలూ, ములాయం

Nov 28 2014 8:54 AM | Updated on Sep 2 2017 5:17 PM

బంధువులు కాబోతున్న లాలూ, ములాయం

బంధువులు కాబోతున్న లాలూ, ములాయం

ఒకప్పుడు మిత్రులుగా కొనసాగి, ఆ తర్వాత శత్రువులుగా ఉన్న యాదవ ద్వయం త్వరలో బంధువులు కాబోతున్నారు.

న్యూఢిల్లీ: ఉత్తరాది రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే బీహార్లో అధికార జనతాదళ్ (యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయాలని నిర్ణయించగా, ఈ కూటమికి ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యారు. ఒకప్పుడు మిత్రులుగా కొనసాగి, ఆ తర్వాత శత్రువులుగా ఉన్న యాదవ ద్వయం త్వరలో బంధువులు కాబోతున్నారు.

ములాయం మనవడు తేజ్ప్రతాప్ యాదవ్కు, లాలూ చిన్న కుమార్తె రాజ్ లక్ష్మీకి వివాహం కుదిరింది. డిసెంబర్ మధ్యలో వీరి నిశ్చితార్థం జరిగే అవకాశముంది. ఇక పెళ్లి ఫిబ్రవరిలో చేయాలని భావిస్తున్నారు. తేజ్ప్రతాప్ యూపీలోని మొయిన్పురి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తమ స్నేహం బంధుత్వంగా మారబోతోందని లాలూ, ములాయం చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement