
మహానగరం నుంచి వచ్చి మహమ్మారి సోకి..
జైపూర్ : కరోనా మహమ్మారి విశృంఖలంగా వ్యాపించిన ముంబై నుంచి రాజస్ధాన్‌లోని భిల్వారాకు కాలినడకన చేరుకున్న వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీంతో భిల్వారాలో సోమవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8000 దాటగా గడిచిన 24 గంటల్లో 440 తాజా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 342కు పెరిగింది. ముంబై నగరంలోనే 5194 కరోనా కేసులు వెలుగుచూడగా 204 మంది మరణించారు.