ఢిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి అరెస్ట్‌

Man Opens Fire In Delhi Shaheen Bagh Police Identified Kapil Gujjar - Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న నిరసనకారులపై ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఉదంతం మరవక ముందే శనివారం మరో ఘటన చోటుచేసుకుంది. గతకొన్నిరోజుల నుంచి పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో పెద్దఎత్తున మహిళలు, విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఓ ఆకతాయి యువకుడు షాహిన్‌బాగ్‌లో కాల్పలకు దిగటం కలకలం రేపింది.

వివరాల్లొకి వెళితే.. షాహిన్‌బాగ్‌లో మహిళలు, విద్యార్ధులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న వేదికకు 250 మీటర్ల దూరంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద ఓ యువకుడు గాలల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. దీంతో వెంటనే అక్కడున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి కాల్పులు జరుపుతూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతను పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కాల్పులు  జరిపినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని డల్లూపుర గ్రామానికి చెందిన కపిల్‌ గుజ్జర్‌గా పోలీసులు గుర్తించారు.(కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top