ఆయనకొచ్చిన కరెంట్‌ బిల్లు చూస్తే.. వామ్మో అనాల్సిందే

UP Man Charged Rs 128 Crore For Home Electricity Bill - Sakshi

లక్నో: ఓ సాధారణ, పేదవాడికి వచ్చే కరెంట్‌ బిల్లు మహా అంటే వంద, లేక వేలల్లో వస్తుంది. కానీ ఆ ఇంటి వాళ్లకు మాత్రం అక్షరాలా నూటా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్ పడింది. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో ఓవ్యక్తి ఇంటికి ఏకంగా రూ.128, 84, 59, 544.00. బిల్లు వచ్చింది. దీనిని చూసిన ఇంటి యజమాని షమీమ్, అతని భార్య  షాక్‌కి గురయ్యారు. తాము వాడే సింగిల్‌ ఫ్యాన్‌, లైటుకే ఇంత బిల్లు రావడం ఏంటని ఆశ్చర్యపోయారు. వారికి అంత స్థోమత లేకపోవడంతో బిల్లు కట్టలేకపోయారు. అయితే ఒక రోజు కరెంట్ వాళ్లు వచ్చి.. కనెక్షన్ కట్ చేస్తుంటే ఎందుకని షమీమ్ ప్రశ్నించాడు. బిల్లు మొత్తం కట్టే వరకు కనెక్షన్ ఇచ్చేది లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏంటా అని ఆరాతీస్తే.. కోట్లలో బిల్లు ఉంది. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే... ఎవ్వరూ పట్టించుకోకపోగా.. బిల్లు కట్టాల్సిందేనని పట్టుబట్టారు.

దీంతో ఆయన ప్రభుత్వ కార్యాలయాలు చూట్టూ తిరగడం ప్రారంభించాడు. చివరకు విషయం మీడియాకు చేరడంతో అసలు విషయం బయటపడింది. అదంతా సాంకేతిక సమస్య కారణంతో జరిగిందని అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అధికారుల తీరుపై షమీమ్ మండిపడ్డాడు. కరెంట్ వాళ్లు తమ ఇంటికేగాక.. మొత్తం హపూర్ నగరం బిల్లంతా తనకే ఇచ్చారని షమీమ్ ఎద్దేవా చేస్తున్నాడు. విద్యుత్ శాఖ తప్పిదాల కారణంగా ఇప్పటికే అనేకసార్లు భారీ ఎత్తున బిల్లులు వచ్చిన విషయం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top