మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి.. | Man booked for raping two minor girls | Sakshi
Sakshi News home page

మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి..

Jun 12 2016 11:25 AM | Updated on Oct 9 2018 5:39 PM

మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి.. - Sakshi

మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ పిలిచి..

మొబైల్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి పిలిచిన ఓ వ్యక్తి వారిపై లైగిక దాడికి పాల్పడ్డాడు.

థానే: మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకొమ్మంటూ ఇద్దరు చిన్నారులను ఇంట్లోకి పిలిచిన ఓ వ్యక్తి వారిపై లైగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. వేగిల్ ఎస్టేట్ ఏరియాలోని బందువుల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి, చుట్టుపక్కల ఇళ్లలో ఉండే  ఆరేళ్ల, తొమ్మిదేళ్ల బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు ఆదివారం స్థానిక పోలీసులు వెల్లడించారు. బాలికలతో పరిచయం పెంచుకున్న సదరు వ్యక్తి మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలంటూ ఇంట్లోకి పిలిచి వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

లైంగిక దాడి విషయాన్ని బాలికలు వారి తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు బాలికలు వేరువేరు ఫ్యామిలీలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై సెక్షన్ 376, బాలలపై హక్కుల చట్టాల కింద కేసునమోదు చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement