ఉప ఎన్నికలో 16 శాతం పోలింగ్‌ | Malappuram by-poll: 16% voting till 9 am | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలో 16 శాతం పోలింగ్‌

Apr 12 2017 12:37 PM | Updated on Sep 5 2017 8:36 AM

మలప్పురం లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో ఉదయం 9గంటల వరకు 16 శాతం పోలింగ్‌ నమోదైంది.

హైదరాబాద్‌: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 16 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు లేవని, కొన్నిచోట్ల ఈవీఎంలు తప్పుగా పనిచేయడంతో వాటిని సరిచేశామని అధికారులు తెలిపారు. కేంద్ర మాజీమంత్రి ఇ. అహ‍్మద్‌ మృతితో ఈ స్తానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
 
కాంగ్రెస్‌-యూడీఎఫ్‌ తరపున పి.కె.కన్హాలికుట్టి, సీపీఐ(ఎం) నుంచి ఎం.బి.ఫయాసల్‌(అధికార ఎల్‌డీఎఫ్‌), బీజేపీ మద్దతు ఇస్తున్న ఎన్‌.శ్రీప్రకాస్‌లు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement