అచ్చం సినిమా సీన్‌ను తలపించేలా.. | Maharashtra Agriculture Minister Poses As A Farmer To Raids On Fertilizer Shop | Sakshi
Sakshi News home page

రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్‌ను తలపించేలా..

Jun 22 2020 1:15 PM | Updated on Jun 22 2020 1:53 PM

Maharashtra Agriculture Minister Poses As A Farmer To Raids On Fertilizer Shop - Sakshi

దాదాజి భూసే

ముంబై : సినిమా సీన్‌ను తలపించే ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాజి భూసే రైతు వేషం వేశారు. ఓ సాధారణ రైతులా వెళ్లి ఓ ఎరువుల షాపు యజమాని పనిపట్టారు. ఈ సంఘటన ఆదివారం ఔరంగాబాద్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం మంత్రి దాదాజి భూసే రైతు వేషంలో ఔరంగాబాద్‌లోని ఎరువుల షాపులపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవభారత్‌ అనే ఎరువుల షాపు దగ్గరకు వెళ్లి 10 బస్తాల యూరియా కావాలని అడిగారు. ( ముంబైకి మరో ముప్పు)

అయితే షాపు యజమాని ఎరువుల నిల్వలు ఉన్నప్పటికి లేవని సమాధానం ఇచ్చాడు. స్టాక్‌ రిజిస్టర్‌ చూపించమని అడిగితే ఇంట్లో మర్చిపోయానని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మంత్రి జిల్లా అధికారులను షాపుపై సోదాలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచనామా నిర్వహించిన పోలీసులు దాదాపు 1300 యూరియా బస్తాలను  స్వాధీనం చేసుకున్నారు. మంత్రి భూసే మాట్లాడుతూ.. క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు సక్రమంగా పనిచేయాలని, అలా అయితేనే రైతులు ఇబ్బందులు పడరని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement