లాక్‌డౌన్‌ : కూతురును కాపాడుకోవాలనే తాపత్రయంతో..

Lucknow Woman Trudges 900 km To Save Daughter From Coronavirus - Sakshi

లక్నో : మండుటెండలో ఒక చేతిలో బ్యాగు పట్టుకుని మరో చేత్తో తన మూడేళ్ల కూతురును భుజాలపై ఎత్తుకొని తన సొంతూరుకు వెళ్లడానికి ఏదైనా వాహనం లిఫ్ట్‌ ఇస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తోంది. ఇంతలో ఒక ట్రక్కు స్పీడుగా ఆమెను దాటుకుంటూ వెళ్లిపోయింది. ఇక చేసేదేంలేక కాలినడకనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది.తన కూతురిని కరోనా బారీ నుంచి కాపాడాలనే ఆ తల్లి తాపత్రయం ఇండోర్‌ నుంచి 900 కిలోమీటర్ల దూరంలో ఉ‍న్న అమేథీకి నడిపించేలా చేసింది. వివరాలు..  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రుక్సానా బానో తన భర్త అఖ్విబ్‌తో కలిసి యూపీలోని అమేథీలో నివసిస్తుంది. వారిద్దరికి నర్గీస్‌ అనే మూడేళ్ల కూతురుంది. 8వ తరగతి వరకు చదువుకున్న రుక్సానాకు కూతురంటే పంచప్రాణాలు. తాను బతికేదే తన కూతురు కోసమని రుక్సానా చాలాసార్లు స్పష్టం చేసింది. రుక్సానా భర్త అఖ్విబ్‌ ఒక హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుండగా, ఆమె ఇళ్లలో పనిమనిషిగా చేస్తుంది. వారిద్దరికి కలిపి వచ్చే 9వేల రూపాయల జీతంలో ప్రతీ నెల రూ. 3వేలు తన కూతురు నర్గీస్‌ పేరిట బ్యాంకులో డిపాజిట్‌ చేసేవారు. తాము చదవుకోకపోయినా నర్గీస్‌ మాత్రం చక్కగా చదువుకోవాలనే ఆలోచన రుక్సానాలో బలంగా ఉండేది. ఇలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టించింది.
(ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు)

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌  విధించింది. లాక్‌డౌన్‌ వారి పాలిట శాపంగా మారింది. ఇద్దరు తమ ఉపాధి కోల్పోవడంతో అంతవరకు తాము దాచుకున్న డబ్బులు చూస్తుండగానే ఆవిరయ్యాయి.అయితే తన కూతురు రుక్సానా పేరిట బ్యాంకులో ఉ‍న్న డబ్బును తీయడానికి రుక్సానా మనసు ఒప్పుకోలేదు. ఎంత కష్టమైనా సరే ఆ డబ్బు తీయద్దని భావించింది.అప్పటికే ఇండోర్‌ ప్రాంతంలో కరోనా కోరలు చాస్తుంది.  అయితే కేంద్రం లాక్‌డౌన్‌ను గతవారం మళ్లీ  పొడిగించడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.ఇక్కడే ఉంటే తన కూతురు కరోనా బారీన పడుతుందేమోనని భయపడింది. ఉన్న ఊరును వదిలి అమేధీలోని సొంతూరుకు వెళ్లాలని అనుకుంది. ఇదే విషయాన్ని భర్తతో చెబితే తాను ఇప్పుడు రాలేనని , ఇక్కడే ఉంటానని రుక్సానాకు చెప్పాడు. భర్త తన వెంట రావడానికి సముఖత వ్యక్తం చేయకపోవడంతో అఖ్విబ్‌ను వదిలేసి సొంతూరుకు వెళ్లాలని నిశ్చయించుకుంది.

ఇంతలో తనకు తెలిసిన బంధువులు కూడా అమేధీలోని సొంతూరుకు వెళుతున్నారని తెలుసుకుంది. ఒక బ్యాగులో దుస్తులు, బిస్కెట్లు, జామ్‌ పెట్టుకొని కూతురు నర్గీస్‌ను తీసుకొని ఆ బృందంతో కలిసి బుధవారం రాత్రి ప్రయాణం ప్రారంభించింది. ట్రక్కు, లారీల్లో లిఫ్ట్‌ అడిగి వారంతా కలిసి ఎలాగోలా లక్నోకు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. రుక్సానా తన బిడ్డ నర్గీస్‌కు ఎండ వేడి తగలకుండా ముఖానికి ఒక చిన్న గుడ్డ కప్పి తన బంధువులతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇదే విషయాన్ని రుక్సానాను అడగితే.. ' లాక్‌డౌన్‌ మా పాలిట శాపమైంది. అయినా సరే నా కూతురును కాపాడుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నా. ఎంతకష్టమైనా సరే సొంతూరుకు వెళ్లేవరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

12-07-2020
Jul 12, 2020, 13:01 IST
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ..
12-07-2020
Jul 12, 2020, 13:00 IST
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామన్న ప్రభుత్వం
12-07-2020
Jul 12, 2020, 12:46 IST
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్‌ రాజన్‌ సింగ్‌ సింగ్రౌలీలోని ఖాతుర్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా అభయ్‌ భార్యకు కరోనా...
11-07-2020
Jul 12, 2020, 12:34 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 12:28 IST
కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు.
12-07-2020
Jul 12, 2020, 12:20 IST
సాక్షి, ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో ఉండే మేనమామ వద్దకు వెళ్తే కరోనా సోకింది.. ధైర్యంతో ఆ మహమ్మారిని జయించిన యువకుడు ఆనందంగా ఇంటి...
12-07-2020
Jul 12, 2020, 12:02 IST
ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌ద‌లట్లేదు... నెమ్మ‌దిగా బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ వైర‌స్ ప్ర‌ముఖుల ఇంట్లోకి చొర‌బడుతోంది. ఇప్ప‌టికే బిగ్‌బీ అమితాబ్...
12-07-2020
Jul 12, 2020, 11:23 IST
సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో...
12-07-2020
Jul 12, 2020, 10:56 IST
ముంబై: ప్ర‌ముఖ న‌టి రేఖ ఇంటికి క‌రోనా సెగ తాకింది. ఆమె సెక్యూరిటీ గార్డుకు శ‌నివారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...
12-07-2020
Jul 12, 2020, 10:55 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు....
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,637 కరోనా...
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
న్యూఢిల్లీ: క‌రోనా బారిన ప‌డ్డ గ‌ర్భిణిల‌కు పుట్టే శిశువులకు వైర‌స్ సోకిన వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే క‌రోనా నెగెటివ్...
12-07-2020
Jul 12, 2020, 09:33 IST
సాక్షి, ముంబై: కోవిడ్‌ బారినపడ్డ బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్‌...
12-07-2020
Jul 12, 2020, 08:44 IST
కరోనా మందుల కొనుగోలుకు కఠిన నిబంధనలు
12-07-2020
Jul 12, 2020, 08:39 IST
సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్‌–19 విధ్వంసానికి అంతులేకుండా పోతోంది. శనివారం ఒకేరోజులో 70 మంది కరోనా కోరలకు బలి అయ్యారు....
12-07-2020
Jul 12, 2020, 06:12 IST
కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటికే కీలకమైన సమాచారం పరిశోధనల ద్వారా తెలిసి నా.. తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు...
12-07-2020
Jul 12, 2020, 05:49 IST
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు...
12-07-2020
Jul 12, 2020, 05:21 IST
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉగ్రరూపం చూపిస్తున్న వేళ దానిని కట్టడి చేయడం సాధ్యమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ...
12-07-2020
Jul 12, 2020, 04:32 IST
న్యూఢిల్లీ:   చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేసే ఇటోలిజుమాబ్‌ అనే సూదిమందును అత్యవసర పరిస్థితుల్లో కరోనా బాధితులకు ఇవ్వొచ్చని డ్రగ్స్‌...
12-07-2020
Jul 12, 2020, 04:07 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నాలుగు రోజుల నుంచి వెయ్యి దాటుతోంది. గడిచిన 24...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top