చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక బిల్లుకు ఓకే

Lok Sabha Passes Unlawful Activities Amendment Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చలో హోంమంత్రి అమిత్‌ షా పాల్గొంటూ విపక్షాల అభ్యంతరాను ఆక్షేపించారు. ఈ చట్టం కాంగ్రెస్‌ హయాంలోనే రూపొందిందని మీరు అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిన చట్టాన్ని తాము పటిష్టం చేస్తున్నామని చెప్పారు. అప్పుడు మీరు సరైనదైతే తాము ఇప్పుడు చేస్తున్నదీ సరైనదేనని స్పష్టం చేశారు. ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించేందుకు వెసులుబాటు ఉండేలా నిబంధన ఉండాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితిలో, అమెరికా, పాకిస్తాన్‌లోనూ చట్టపరిధిలో ఈ నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. చైనా, ఇజ్రాయెల్‌, ఐరోపా యూనియన్‌లోనూ ఈ నిబంధన ఉందని చెప్పుకొచ్చారు. భారత్‌లో ఎంతో మంది ప్రశంసనీయంగా సామాజిక సేవలో నిమగ్నమయ్యారని ఆయన పేర్కొన్నారు. అర్బన్‌ మావోయిజం కోసం పనిచేసే వారి పట్ల తమకు ఎలాంటి సానుభూతి లేదని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top