మే 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

Lockdown extends another two weeks in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మే 17 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ జారీచేసింది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతించారు. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి పరిస్ధితిని సమీక్షిస్తామని కేంద్ర హోంశాఖ పేర్కొంది.(తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లు ఇవే..)

కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు నానాటికీ దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ మొదటి దశ మార్చి 22న ప్రారంభమై మార్చి 31న ముగిసింది. లాక్‌డౌన్‌ రెండో దశ ఏప్రిల్‌ 1న ప్రారంభమై మే3 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ మూడో దశ మే 4 నుంచి మే 17 వరకు ప్రకటించింది. దీంతో మొత్తం 56 రోజులు భారత్‌లో లాక్‌డౌన్‌ విధించినట్టయింది. అయితే మూడో దశలో కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో చెప్పుకోదగ్గ మినహాయింపులు ఇచ్చారు.(ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌ జోన్లు ఇవే)

3వ దశ లాక్‌డౌన్‌ నిబంధనలు ఇవే..

విమానాలు, రైళ్లు, అంతరాష్ట్ర ప్రయాణాల నిషేధం
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు బంద్‌
హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు బంద్‌
స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసి ఉంచాలి
అన్ని ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్లు రద్దు
అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి
గ్రీన్‌ జోన్లు, ఆరెంజ్‌ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు
రాత్రి 7గం.ల నుంచి ఉ.7గంటల వరకు కర్ఫ్యూ అమలు
వారానికి ఒకసారి రెడ్‌ జోన్లలో పరిస్థితి పరిశీలన
కేసులు తగ్గితే రెడ్‌ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు
గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సాధారణ కార్యకలపాలకు అనుమతి
గ్రీన్‌ జోన్లలో ఉ.7 నుంచి సా.7వరకు వ్యాపారాలకు అనుమతి
ఆరెంజ్‌ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి
ఆరెంజ్‌ జోన్లు: కార్లలో ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి
ఆరెంజ్‌ జోన్లు: టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి
ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు
గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్‌ క్యాబ్‌లకు అనుమతి
వ్యవసాయ పనులన్నింటికీ అనుమతి
రెడ్‌ జోన్లలో ఎలాంటి సడలింపులు లేవు
33 శాతం సిబ్బందితో ప్రైవేటు సంస్థలు పనిచేసేందుకు అనుమతి
రాష్ట్రాల పరిధిలో బస్సులకు అనుమతిచ్చిన ప్రభుత్వం
బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణాలకు అనుమతి
గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో ఆన్‌ లైన్‌ షాపింగ్‌కు అనుమతి
ప్రైవేట్‌ కార్యాలయాల్లో 33% వరకు సిబ్బంది హాజరుకు అనుమతి
అన్ని రకాల గూడ్స్‌, కార్గో, ఖాళీ లారీలకు కూడా అనుమతి
బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్‌ ధరించాల్సిందే
పెళ్లిళ్లకు అనుమతి, 50 మంది వరకు హాజరు కావొచ్చు
అంత్యక్రియలకు 20 మంది వరకు హాజరయ్యేందుకు అనుమతి
గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు కూడా అనుమతి(ఆ జోన్లలో లిక్కర్‌ కిక్‌..)
మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించకుండా ఉండాలి

కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించిన విషయం తెలిసిందే. ఆ శాఖ రూపొందించిన పలు నియమ నిబంధనల మేరకు జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించారు. రెడ్‌, ఆరెంజ్‌ మరియు గ్రీన్‌ జోన్లుగా విభజించి తదనుగుణంగా కొన్ని పరిమితులను విధించారు.

రెడ్‌ జోన్స్‌ (హాట్‌స్పాట్‌ జిల్లాలు) - కరోనా వైరస్‌కు సంబంధించి మొత్తం యాక్టివ్‌ కేసులు, పాజిటివ్‌ కేసులు రెండింతలుగా నమోదు కావడం, ఆయా ప్రాంతాల్లో జరిగిన పరీక్షలు, నిఘా వర్గాల సమాచారం మేరకు రెడ్‌ జోన్లను ప్రకటించారు. గ్రీన్ జోన్లు - గడిచిన 21 రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్‌జోన్లుగా గుర్తించారు. ఇకపోతే, రెడ్‌, గ్రీన్‌ కానీ పరిస్థితులున్న ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ లెక్కన దేశ వ్యాప్తంగా 733 జిల్లాలను ఆయా జోన్ల కింద విభజించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తీరు, పాజిటివ్‌ కేసులు నమోదు వంటి ప్రక్రియల ఆధారంగా  130 జిల్లాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. అలాగే 284 ఆరెంజ్‌ జోన్‌లోకి రాగా 319 జిల్లాలు గ్రీన్‌ జోన్‌లో నిలిచాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

04-06-2020
Jun 04, 2020, 10:22 IST
సాక్షి,  ముంబై: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ఆదాయాలను కోల్పోయిన పలు సంస్థలు  ఉద్యోగాల కోత, వేతనాలు తగ్గింపు లాంటి నిర్ణయాలు...
04-06-2020
Jun 04, 2020, 09:32 IST
ఢిల్లీ: బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చేవారు ఖచ్చితంగా వారం రోజుల పాటు హోం...
04-06-2020
Jun 04, 2020, 09:00 IST
టి.వి. చూస్తున్నాడు. ఓ.కే. ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతున్నాడు. ఓ.కే.ఇంట్లో అటూ ఇటూ చక్కర్లు కొడుతున్నాడు.ఓ.కే.కాని ఫ్రెండ్స్‌ని కలవట్లేదు. ఫ్రెండ్స్‌తో ఆడే...
04-06-2020
Jun 04, 2020, 08:52 IST
జూబ్లీహిల్స్‌: చీకట్లను చీల్చుకుంటూ వచ్చే కిరణాలు వెండితెరపై పడగానే ఆ తెర ఒక్కసారిగా వెలుగులీనుతుంది. అదే వెండి తెర ఇప్పుడు...
04-06-2020
Jun 04, 2020, 08:43 IST
కోవిడ్‌-19 చికిత్సకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించే దిశగా జరిగే క్లినికల్‌ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది.
04-06-2020
Jun 04, 2020, 05:56 IST
సెయింట్‌ జాన్స్‌: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే మూడు టెస్టుల సిరీస్‌ కోసం తాము ఇంగ్లండ్‌లో పర్యటించబోమని వెస్టిండీస్‌ ఆటగాళ్లు...
04-06-2020
Jun 04, 2020, 04:56 IST
న్యూఢిల్లీ:  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దేశంలో వరుసగా నాలుగో రోజు 8 వేలకు...
04-06-2020
Jun 04, 2020, 04:44 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగు లక్షల మార్కును అధిగమించింది. మంగళవారం ఉదయం 9 గంటల...
04-06-2020
Jun 04, 2020, 04:33 IST
చైనాకు చెందిన ఎయిర్‌ చైనా, చైనా ఈస్ట్రర్స్‌ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్‌ ఎయిర్‌లైన్స్, జియామెన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ దేశంలో...
04-06-2020
Jun 04, 2020, 04:16 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలంతో  ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలన్న అంశంపై...
04-06-2020
Jun 04, 2020, 03:49 IST
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్‌ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా...
04-06-2020
Jun 04, 2020, 03:41 IST
మనిషికీ మనిషికీ మధ్య మూడు సీట్ల దూరం ఉంటుందా? ఒకే కుటుంబానికి చెందినవారు వెళితే నాలుగు సీట్లు ఒకేచోట ఉంటాయా?...
04-06-2020
Jun 04, 2020, 02:43 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వైరస్‌ ఉధృతి ఏ...
04-06-2020
Jun 04, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్ ‌: నిమ్స్‌ ఆస్పత్రి కరోనా భయంతో వణికిపోతోంది. ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి చెందిన నలుగురు రెసిడెంట్‌ వైద్యులు,...
04-06-2020
Jun 04, 2020, 01:44 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా భయం.. లాక్‌డౌన్‌తో ఉపాధి కరవు.. వెరసి వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. వారిపై ఆధారపడ్డ...
04-06-2020
Jun 04, 2020, 00:37 IST
లండన్‌: ఫార్ములావన్‌  (ఎఫ్‌1) రేసుల్లో పాల్గొనేందుకు వచ్చిన డ్రైవర్లలో ఎవరికైనా కరోనా సోకినా... పోటీ మాత్రం ఆగదని ఎఫ్‌1 సీఈఓ...
04-06-2020
Jun 04, 2020, 00:26 IST
కరోనా వైరస్‌ మహమ్మారిపై మన దేశం ఎడతెగకుండా పోరు సాగిస్తున్నా ఆ కేసుల సంఖ్య 2,07,000 దాటిపోయింది. ఆ వైరస్‌...
03-06-2020
Jun 03, 2020, 21:02 IST
తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు.
03-06-2020
Jun 03, 2020, 18:04 IST
పనాజి: దేశంలో క‌రోనా విజృంభణ త‌క్కువ‌గా ఉన్న‌ గోవాలో బుధ‌వారం ఒక్క‌రోజే పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం...
03-06-2020
Jun 03, 2020, 17:36 IST
ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది వలస కార్మికులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top