లైన్‌ క్లియర్!‌.. తీర్పు ఆలస్యం?

Line Clear for Karunanidhi Cremations in Marina Beach - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, కలైంగర్‌ కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు వీడింది. ఈ వ్యవహారంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక కార్యకర్త ట్రాఫిక్‌ రామస్వామి(84) ప్రకటించారు. దీంతో రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు గతంలో దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను(ఐదింటిని) మద్రాస్‌ హైకోర్టు బెంచ్‌ డిస్‌మిస్‌ చేసింది. అయితే కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన పిటీషన్‌పై మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అత్యవసర తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడటంతో.. తీర్పును కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(కరుణానిధి అరుదైన ఫోటోలు.. క్లిక్‌ చేయండి)

గతంలో మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై ట్రాఫిక్‌ రామస్వామి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణ అంత్యక్రియలకు ఆ పిటిషన్‌ ఆటంకంగా మారింది. కోర్టు కేసుల నేపథ్యంలో అంత్యక్రియలకు స్థలం కేటాయించలేమని పళని ప్రభుత్వం పేర్కొంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. గత రాత్రి నుంచి ఈ వ్యవహారంపై వాదనలు జరిగాయి. చివరకు తదుపరి వాదనలు ఈ ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఉత్కంఠ నెలకోగా, రామస్వామితో చీఫ్‌ జస్టిస్‌ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ రాతపూర్వకంగా ఆయన బెంచ్‌కు ఓ మెమొరాండం సమర్పించారు. అంతేకాదు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కోర్టులో ప్రభుత్వం, డీఎంకే తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ప్రకటించాల్సిన అవసరం లేదన్న చీఫ్‌ జస్టిస్‌..   ఈ రోజే తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. (నిండు సభలో దుశ్శాసన పర్వం)

‘తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని’ జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు కూడా. కానీ, రామస్వామి పిటిషన్‌ మూలంగానే న్యాయపరమైన చిక్కుల నెలకొన్నాయన్న విషయం తర్వాతే తేలింది.
(అమ్మకు ఘన నివాళి)
(కరుణ వల్లే ఇదంతా...)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top