
సరికొత్త హెలికాప్టర్ చక్కర్లు
భారత రక్షణరంగ అమ్ములపొదిలో సరికొత్త హెలికాప్టర్ చేరికకు రంగం సిద్ధమైంది.
సాక్షి, బెంగళూరు: భారత రక్షణరంగ అమ్ములపొదిలో సరికొత్త హెలికాప్టర్ చేరికకు రంగం సిద్ధమైంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ (హెచ్‌ఏఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్‌యూహెచ్) పీటీ–2 మంగళవారం మొదటిసారి గాల్లో చక్కర్లు కొట్టింది.
ఇది 22 నిమిషాలు గగనవిహారం చేసింది. 3 టన్నుల బరువున్న ఎల్‌యూహెచ్‌ను సాయుధ దళాలతో పాటు పౌరసేవలకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. అద్దాల కాక్‌పీట్ ఉండటం పీటీ– 2 ప్రత్యేకత. ఇది 400 కేజీల బరువైన ఆయుధాలను మోసుకుపోగలదని హెచ్‌ఏఎల్ తెలిపింది. ఇది ఎల్‌యూహెచ్ పీటీ–1కు ఆధునిక వెర్షన్.