‘రోజుకు 2000 శాంపిల్స్‌ పరీక్షిస్తాం’ | Lab At JJ Hospital Will Soon Be Able To Test More Samples | Sakshi
Sakshi News home page

టెస్టింగ్‌ సామర్థ్యం పెంపు

Apr 28 2020 8:10 PM | Updated on Apr 28 2020 8:10 PM

Lab At JJ Hospital Will Soon Be Able To Test More Samples - Sakshi

ముంబైలో టెస్టింగ్‌ సామర్థ్యం పెంపుదల

ముంబై : కరోనా మహమ్మారి ముంబైలో విస్తృతంగా వ్యాప్తిస్తున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం నగరంలో మహమ్మారి కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముంబైలోని ప్రతిష్టాత్మక జేజే ఆస్పత్రిలో నెలాఖరు నాటికి రోజుకు 2200 శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యాన్ని పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో రోజుకు 100 శాంపిల్స్‌ను టెస్ట్‌ చేస్తున్నారు. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో(ఎన్‌ఐవీ) రోజుకు 800 నమూనాలను పరీక్షిస్తున్నారు.

ముంబైలోని మరో రెండు ప్రభుత్వ ఆస్పత్రులు జీటీ, సెంట్‌ జార్జ్‌ ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చారు. అత్యధిక పరీక్షలు చేపట్టేందుకు వీలుగా జేజే ఆస్పత్రిలో ఆర్‌టీ-పీసీఆర్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో ఇక్కడ రోజుకు 2200 శాంపిల్స్‌ను పరీక్షించేలా అప్‌గ్రేడ్‌ చేస్తామని వైద్య శాఖ అధికారి వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి లక్ష మందికి పైగా తాము పరీక్షించామని చెప్పారు. వైరస్‌ను నేరుగా గుర్తించే పీసీఆర్‌ టెస్ట్‌లపైనే తాము దృష్టికేంద్రీకరించామని, దీంతో సత్వరమే వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించే అవకాశం ఉంటుందని అన్నారు.

చదవండి : ముంబై నుంచి కాలినడకన..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement