గుమస్తా కంటే ఎక్కువ పని చేస్తున్నాను : సీఎం

Kumaraswamy Says Working Like a Clerk Not CM - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్‌ - కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో పొరపొచ్చలు మరోసారి బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం వచ్చే లోక్‌ సభ ఎన్నికల వరకూ కూడా నిలవలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సేల సమావేశానికి హాజరైన కుమార స్వామి మాట్లాడుతూ.. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ కలగజేసుకుంటుందని.. ఫలితంగా తాను సీఎం అయి ఉండి కూడా గుమస్తా కంటే ఎక్కువ చాకిరీ చేస్తున్నాని వాపోయాడు.

కాంగ్రెస్‌ నాయకులు తనను ఓ సబార్డినేట్‌గా చూస్తున్నారని.. తన మీద చాలా ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన ప్రతి కాగితం మీద సంతకం చేయాలంటూ కాంగ్రెస్‌ నాయకులు తనను ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అసలు తన ప్రమేయం లేకుండానే కొన్ని విషయాలకు సంబంధించిన పనులు పూర్తవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదయితే కుమారస్వామి ఇలా బాధపడటం ఇదే ప్రథమం కాదు. గతంలో సీఎం స్థానంలో తను సంతోషంగా లేనని.. గరళకంఠుడిలా బాధను దిగమింగుతూ పనిచేస్తున్నానని కుమారస్వామి కన్నీటిపర్యంతం అయిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top