రాహుల్‌తో కుమారస్వామి భేటీ

Kumaraswamy Meets Rahul Gandhi Over State Budget Issues - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం నేపథ్యంలో కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీనియర్‌ జేడీఎస్‌ నేత ధనిష్‌ అలీ, కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్‌ పట్టుబడుతుండగా, కాంగ్రెస్‌ మాత్రం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడితే సరిపోతుందని వాదిస్తోంది.

కొత్త ప్రభుత్వ దశదిశను వెల్లడించేందుకు పూర్తిస్ధాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని జేడీఎస్‌ స్పష్టం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీని కలుస్తానని సీఎం కుమారస్వామి సైతం గతంలో పేర్కొన్నారు. అయితే కొద్దినెలల కిందట సీఎంగా తాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన క్రమంలో ప్రస్తుతం నూతన బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని మాజీ సీఎం సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం నిర్ధిష్ట ప్రాజెక్టులు, పథకాలు చేపట్టదలిస్తే అనుబంధ బడ్జెట్‌లో వాటిని పొందుపరచవచ్చని ఆయన కుమారస్వామికి సూచించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top