మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్! | keralites go in queue to get arrested by trainee ips officer | Sakshi
Sakshi News home page

మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!

Sep 11 2014 11:48 AM | Updated on Jul 26 2018 5:21 PM

మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్! - Sakshi

మేడమ్.. నన్ను అరెస్టు చేయండి ప్లీజ్!

కేరళలో ఇప్పుడంతా మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు.

కేరళలో ఇప్పుడంతా మమ్మల్ని అరెస్టు చేయండి ప్లీజ్ అంటూ క్యూ కడుతున్నారు. అయితే వీళ్లెవరూ ఏ స్టేషన్ పడితే ఆ స్టేషన్కు వెళ్లట్లేదు. కేవలం కొచ్చి ఏసీపీ వద్దకు మాత్రమే అరెస్టు చేయాలంటూ వెళ్తున్నారు. ఎందుకంటే.. మెరిన్ జోసెఫ్ అనే ఐపీఎస్ అధికారిణి అక్కడ ఏసీపీగా ఇటీవలే ఛార్జి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె ఫొటోను ఫేస్బుక్లో విపరీతంగా షేర్ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయండి అంటూ కోరుతున్నారు. మెరిన్ జోసెఫ్ అందంగా కనపడటమే అందుకు కారణం. ఆమె చేతుల్లో అరెస్టు కావడానికి తాము దొంగలుగా మారేందుకు కూడా అభ్యంతరం లేదని కొంతమంది చెబుతున్నారు.

ఇదంతా ఎలా మొదలైందంటే...
కొచ్చి కొత్త ఏసీపీగా మెరిన్ జోసెఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పౌర సమస్యలకు సంబంధించిన ఓ ఫేస్బుక్ పేజీలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫొటో పోస్ట్ చేశారు. కేవలం ఒక్కరోజులోనే ఆ ఫొటోకు ఏకంగా పదివేల లైకులు వచ్చాయి. షేర్లు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. వాట్సప్లో కూడా ఈ ఫొటోను విస్తృతంగా షేర్ చేసుకున్నారు.

నిక్కీ అనే ఓ కుర్రాడు తాను దోపిడీలు మొదలుపెట్టేస్తానని బహిరంగంగా చెప్పాడు. ''వావ్!! ఇంత అందమైన పోలీసు ఆఫీసర్ కొచ్చిని పాలిస్తుంటే చూడటానికి చాలా సంతోషంగా ఉంది. మీకు అభినందనలు!'' అని పెట్టాడు. తనను అరెస్టు చేయాలంటూ ప్రముఖ నటుడు మోహన్లాల్ ఆమెను అడుగుతున్నట్లుగా ఫొటోషాప్లో మార్ఫింగ్ చేసిన ఫొటో కూడా ఫేస్బుక్లో విస్తృతంగా వ్యాపించింది.

ఇప్పుడు అక్కడ లేనే లేరట
అయితే.. ఐపీఎస్ శిక్షణ పొందుతున్న మెరిన్ జోసెఫ్ కేవలం రెండు వారాల శిక్షణ కోసం మాత్రమే కొచ్చికి వెళ్లి, అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు కూడా. ఈ విషయాన్ని డీసీపీ మహ్మద్ రఫీక్ తెలిపారు. 'వై20' పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లే యువ బృందానికి కూడా ఆమె ఇటీవల ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజిలో బీఏ ఆనర్స్ చదివిన మెరిన్ జోసెఫ్.. 2012లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement