బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం: చాందీ | Kerala CM Oommen Chandy meets kin of the law student who was raped & murdered | Sakshi
Sakshi News home page

బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం: చాందీ

May 4 2016 8:58 AM | Updated on Aug 21 2018 5:54 PM

సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన లా కాలేజీ విద్యార్థిని కుటుంబసభ్యులను కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం పరామర్శించారు.

పెరంబవూర్‌:  సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన లా కాలేజీ విద్యార్థిని కుటుంబసభ్యులను కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు విచారణ సరైన మార్గంలోనే కొనసాగుతోందన్నారు. బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ఊమెన్ చాందీ హామీ ఇచ్చారు. కాగా ఈనెల 16న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్ అనుమతితోనే తాను ఈ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.

అసలేం జరిగింది?: ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్‌లో లా కాలేజీ విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేయటంతోపాటు నిర్భయ ఘటనలాగా పదునైన ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని, మెడ, ఛాతీతోపాటు శరీరంలోని ఇతర భాగాలపై 13 గాయలు అయ్యాయి. దీనిపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమెటో కేసును నమోదు చేసి విచారణకోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. కేరళ మానవ హక్కుల కమిషన్ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది. మరోవైపు ఎర్నాకుళంలో హతురాలు చదువుకుంటున్న కాలేజీ విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement