వైరల్‌ : ఎర్రచీరలో ఇరగదీసింది

Kerala Bride Surprises Groom With A Dance - Sakshi

తిరువనంతపురం : వివాహం అనగానే అందరికీ పట్టలేనంత సంతోషం. జీవితాంతం గుర్తుండిపోయే విధంగా వివాహ వేడుకను జరుపుకుంటారు. వివాహ వేదికపై వరుడిని మైమరపించాలనుకున్న ఓ వధువు.. వినూత్న ఎంట్రీతో అతిథులను సైతం ఆశ్చర్య పరిచింది. పెళ్లి మండపంలోకి సంప్రదాయ దుస్తుల్లో నృత్యంతో చేసుకుంటూ వచ్చి అందరి చూపుల్ని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంజలి అనే వధువు వినూత్న ఎంట్రీతో వివాహ వేదికపై తనకు కాబోయే భర్తను ఆశ్చర్యపరచాలనుకుంది.

ఈ క్రమంలో కొంతమంది పిల్లలతో 'మలైయూరు' అనే మలయాళ ఫేమస్‌ పాటకు డాన్స్‌ చేసుకుంటూ మండపంలోకి వచ్చింది. దీంతో వివాహానికి వచ్చిన అతిథులందరూ ఒక్కసారిగా ఆకర్షితులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా అదికాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది. షేర్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే ఫేస్‌బుక్‌లో 75వేల పైగా, ట్విటర్‌లో 50వేలకు పైగా నెటిజన్లు దీన్ని వీక్షించారు. 'డ్యాన్స్‌ చాలా బాగుంది' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top